బ్యాడ్మింటన్ లో సంచలనం: ఇండోనేసియా ఓపెన్ విజేత శ్రీకాంత్
జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ టైటిల్ ను తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కజుమాసా సకాయ్తో తలపడిన శ్రీకాంత్ రెండు వరుస సెట్లలో విజయం సాధించాడు. 13నిమిషాల్లోనే తొలి సెట్‌ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో వెనుకబడిన శ్రీకాంత్ ఆ తర్వాత తేరుకుని సుకాయ్‌పై విజృంభించాడు. దీంతో హోరాహోరీగా సాగిన రెండో సెట్‌ను శ్రీకాంత్ 21-19తో గెలిచి ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. శ్రీకాంత్‌కి ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్.













