ఐడియా అద్భుతం : ఈ స్కూల్ లెర్నింగ్ ఎక్స్ప్రెస్
ఆంద్రప్రదేశ్ ప్రాదమికి పాఠశాలలు మూసివేత, కేరళ లో వాటికే పెద్దపీట.ప్రక్క రాష్టాలను చూసి మనం మారితే……..
దేశంలోనే అక్షరాస్యత అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్ల మరమత్తులు చేపట్టింది. ఒక్క నెలలోనే కొత్త రంగులతో మొత్తం స్కూళ్ల స్వరూపాన్నే మార్చేసింది. వేసవి సెలవుల తర్వాత తిరిగి స్కూలుకు చేరకున్న విద్యార్థులకు అది తమ పాఠశాలేనా అన్న అనుమానం వచ్చింది. అంతలా మార్పులు చేసింది ప్రభుత్వం.
ఇక విషయానికొస్తే … వేసవి సెలవుల తర్వాత స్కూలుకు వచ్చిన పిల్లలకు తమ స్కూలు సరికొత్త రంగులతో కనపడేసరికి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడూ తేలిపోయిన తెల్ల రంగు గోడలతో దర్శనమిచ్చే స్కూలు ఒక్కసారిగా కలర్ఫుల్ బొమ్మలు గోడలపై ప్రత్యక్షమవడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు విద్యార్థులు. కాసర్గాడ్ జిల్లాలోని పిల్లికోడ్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోడలు ఒక్కసారిగా రంగులమయమయ్యాయి. ఆ స్కూలు ముందు భాగం ఉన్న గోడకు రైలు ఇంజిన్ బొమ్మ ఉండగా అక్కడి తరగతి గదులు రైలు బోగీల రంగులోకి మారిపోయాయి. దీంతో తరగతి గదిలోకి వెళుతున్న చిన్నారులకు రైలు బోగీలోకి ఎంటర్ అవుతున్న భావన కలుగుతోందని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు.
స్కూలు గోడ వెనక భాగంపై పెద్ద జంబో విమానం బొమ్మ దర్శనం ఇస్తుంది. దానిపై పిలికోడ్ ఎయిర్లైన్స్ అని రాసి ఉంది. విద్యార్థులను ప్రభుత్వ స్కూల్లో చదివేందుకు ఆసక్తి కనబర్చాలన్న ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ పాఠశాలలను రీమోడలింగ్ చేసేందుకు వ్యూహం రచించింది. ఇందులో భాగంగానే ముందుగా పిలికోడ్ స్కూలు రూపు రేఖలను మార్చేసింది.
స్కూలును కలర్ఫుల్గా తీర్చిదిద్దే బాధ్యతను స్థానిక ఆర్టిస్ట్ అయిన సంజీవ్ వెంగారాకు అప్పగించారు. సంజీవ్ తన క్రియేటివిటీని జోడించి పిల్లలకు ఏమికావాలో ఊహించి ఇలా రైలు, విమానం బొమ్మలు వేసి అబ్బురపరిచాడు. ఇదంతా కేవలం ఒక నెలలోనే కంప్లీట్ చేశాడు. దీంతో ఈ విద్యాసంవత్సరానికిగాను అప్పుడే 160 మంది విద్యార్థులు స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. నర్సరీ పిల్లలకు ఎంతో ఇష్టమైన కార్టూన్లను వారి క్లాస్ రూమ్ గోడలపై వేసి అట్రాక్ట్ చేశాడు. పిల్లలు స్కూలు అయిన తర్వాత కూడా అక్కడే ఆ బొమ్మలను చూస్తూ సమయం గడిపేస్తున్నారు. ఈ కలర్ ఫుల్ గోడలకోసం రూ.2.5 లక్షలు ఖర్చుచేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చిన కేరళ ప్రభుత్వం పనితీరును ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అభినందించాయి













