టీడీపీకి మద్దతిస్తాం : కనిమొళి
విభజన హామీల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి డీఎంకే నైతిక మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ కనిమొళి అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు చెన్నైలో కనిమొళితో సమావేశమయ్యారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చడంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆమెకు వివరించారు. పార్లమెంట్లో తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలనే నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారని, వారికి తాము అండగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో సీఎం.రమేశ్, మురళీమోహన్, టీజీ వెంకటేశ్‌లు పాల్గొన్నారు.













