ఏడు రోజుల్లో ట్రంప్ ను రాష్ట్రానికి రప్పిస్తా
ఏడు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాగల సత్తా తనకు ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. దేవుడే తనను రాజకీయాల్లోకి వెళ్లమన్నారని, ముఖ్యమంత్రి కూడా అవుతానని అన్నారని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. తమ పార్టీకి 48 శాతం ఓటింగ్ లభిస్తుందని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ పార్టీకి ఓట్లు రావని, ఓడిపోతామన్న భయంతోనే తమ పార్టీ గుర్తుపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసిందని అన్నారు.













