కువైత్ తెలుగు కళాసమితి అధ్యక్షురాలిగా జ్యోత్స్న
కువైత్‌లోని ప్రముఖ ప్రవాససాంధ్ర సంఘమైన కువైత్ తెలుగు కళాసమితి అధ్యక్షురాలిగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జ్యోత్స్న ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కళాసమితి ప్రధాన కార్యదర్శిగా అదే జిల్లాకు చెందిన గున్ను రమేశ్‌బాబు ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగు కళాసమితి కువైత్‌లోని తొలి ప్రవాసాంధ్ర సంఘం. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తున్న ఈ సంఘం ప్రతి ఏటా తన పాలక మండలిని ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకుంటోంది. ప్రస్తుతం ఎన్నికైన ఇద్దరు ప్రవాసాంధ్ర సంక్షేమ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, కువైత్‌లోని భారతీయ సంఘానికి ఒక మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం ఇదే మొదటిసారి.













