చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ మిశ్రా
45వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా జస్టిస్ దీపక్ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ఇదివరకు 44వ సీజేఐగా జస్టిస్ జగదీశ్ సింగ్ ఖెహర్ ఉన్నారు. 1977లో లాయర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు మిశ్రా. 1996లో ఒరిస్సా హైకోర్టు అడిషనల్ జడ్జ్‌గా ఆయనను నియమించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో పని చేశారు. 2009 లో పాట్నా హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2010 లో ఢిల్లీ హైకోర్టు కు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2011 లో సుప్రీం కోర్టు లో అపాయింట్ అయ్యారు మిశ్రా.













