ఈ చేప ఖరీదు 12.6 కోట్లు!
తెలుపు, నారింజ రంగు మచ్చలతో చూడముచ్చటగా కనిపిస్తున్నది సాధారణమైన చేప కాదు. చూడగానే నోరూరించేస్తున్న దీనిని సొంతం చేసుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అదేంటి అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ చేప ఖరీదు రూ.12.6 కోట్లు. ఈ చేప పేరు లెజెండ్. జపాన్‌కు చెందిన ఈ మత్స్యం.. మూడడుగుల మూడు అంగుళాల పొడవు ఉంది. కొయికొహక జాతికి చెందిన ఆడ చేపను హిరోషిమా లోని సఖి చేపల మార్కెట్లో వేలం వేశారు. ఈ లెజెండ్‌ను తైవాన్‌కు చెందిన యింగ్యింగ్ రూ.12.6 కోట్లకు కొనుగోలు చేశారు. గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఈ చేప సుమారు 5 లక్షల గుడ్లు పెడుతుంది.













