ఉత్సవాలు సరే….శాంతి బహుమతి మాటేమిటి?

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ప్రారంభ వేడుకలు దేశమంతటా ప్రారంభమైన సందర్భంలో, ఆయన పేరిట నెలకొన్న పురస్కారంపై పలువరి దృష్టి మళ్లింది. ఆ మహానీయుడి సేవలకు గుర్తుగా గతంలోనే అంతర్జాతీయ శాంతి బహుమతి ఏర్పాటైంది. నాలుగేళ్లుగా ఎవరినీ విజేతలుగా ప్రకటించడం లేదు. ప్రతిపాదనలైతే వస్తూనే ఉన్నాయని, వాటిని స్వీకరించే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. పురస్కార ప్రకటనకు అనుమతి కోసమే ఎదురుచూస్తున్నామని, జాప్యం ఎందుకు జరుగుతోందో చెప్పడం కష్టమని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. బాపూజీ ఆదర్శాల అమలుకు గుర్తింపుగా ఈ పురస్కృతిని 1995లో ప్రవేశపెట్టారు.











































































