3 లక్షల మంది గ్రీన్ కార్డుకు దరఖాస్తులు
అమెరికాలో గ్రీన్‌కార్డు (శాశ్వతనివాసం) కోసం 3.06 లక్షల మంది భారతీయులు చేసుకున్న దరఖాస్తులు పోగుపడి ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి జనరల్ వీకేసింగ్ తెలిపారు. రాజ్యసభలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అమెరికా అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే నాటికి 3,95,025 ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని, అందులో 3,06,601 దరఖాస్తులు భారతీయులవేనని తెలిపారు. అమెరికా చట్టాల ప్రకారం ఏటా 1.4 లక్షల గ్రీన్కార్డులే మంజూరవుతాయని వివరించారు. అందులోనూ ఒక్కో దేశానికి గరిష్ఠంగా 7శాతం మాత్రమే ఇస్తారని, ఈ లెక్కన ఏటా 9,800 గ్రీన్‌కార్డులు మాత్రమే భారతీయులకు లభించే అవకాశం ఉందని అన్నారు.













