ఈ విషయంలో మక కన్నా పాకిస్థాన్ బెటర్
భారతీయులు నవ్వడమే మరచిపోతున్నారు. నిజమే మన కన్నా ఎంతో వెనుకబడి ఉందనుకున్న ఉగ్రవాదులకు అడ్డా అయిన పాకిస్థాన్ కూడా ఇండియా కంటే సంతోషంగా ఉంది. తాజాగా ఐక్యరాజ్య సమిమి విడుదల చేసిన హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఇండియా 133వ స్థానంలో ఉంది. గతేడాది కంటే 11 స్థానాలు దిగజారడం గమనార్హం. 156 దేశాల జాబితాలో భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, నేపాల్ కంటే కూడా వెనుకబడిపోయింది. సార్క్ దేశాల్లో ఒక్క ఆప్ఘనిస్థాన్ (145) మాత్రమే మన కన్నా దిగువన ఉంది. మార్చి 20న ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేకు ముందు ఈ డేటా రిలీజ్ చేశారు. ఇందులో ఫిన్లాండ్ తొలి స్థానంలో ఉంది. సార్క్ దేశాల విషయానికి వస్తే పాకిస్థాన్ 75, భూటాన్ 97, నేపాల్ 101, బంగ్లాదేశ్ 115, శ్రీలంక 116 స్థానాల్లో ఉన్నాయి.













