GST ప్రకంపనలు….
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు జీఎస్టీ ప్లాట్‌ఫాం కిందకు చేరాలి. అలా మార్చేదే జీఎస్టీ నెట్వర్క్. ఈ ఆఫీస్‌లో పనిచేసే ఐటీ నిపుణులు, ఉద్యోగులు కొన్ని రోజులుగా శ్రమిస్తూ.. జీఎస్టీ ప్లాట్‌ఫాంను పూర్తిస్థాయిలో తయారుచేస్తున్నారు.
ఇప్పటివరకు 6.6మిలియన్ల మందిని జీఎస్టీ కిందకు చేర్చగా.. ఇంకా 1.7లక్షల కొత్త దరఖాస్తులు జీఎస్టీ నెట్‌వర్క్‌కు చేరాయట. దీంతో వాటిని కూడా జీఎస్టీలోకి మార్చేందుకు అక్కడి ఉద్యోగులు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ఒక్కో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి 30 నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుందని, వాటిని పరిశీలించి జీఎస్టీ కిందకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. మరో విషయమేంటంటే.. జీఎస్టీ నెట్‌వర్క్‌లోని అధికారులు కొన్ని రోజులుగా సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నారట.













