2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సంచలన తీర్పు
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డీఎంకే నేతలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమెళి, డీఎంకే నేత ఏ రాజాను నిర్ధోషులగా తేల్చుతూ పాటియాల సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించింది. నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు చెప్పింది. 2007, 2008 మధ్య 2జీ స్కాం జరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి ఏ రాజా జైలు శిక్ష కూడా అనుభవించారు. రూ.1.76 లక్షల కోట్ల స్కాం జరిగినట్టు కేసు నమోదైంది. ఈ కేసులో అనుకూలంగా తీర్పు రావడంతో డీఎంకే పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.













