ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 19 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. 20న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణ గడువు 22తో ముగుస్తుంది. ఆగస్టు 6నుదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉప రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు ఎన్నుకుంటారు. 233 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12 మంది నామినెటడ్ సభ్యులు, 534 మంది లోక్ సభ ఎంపీలు కలుపుకుని మొత్తం 788 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు.













