కరుణానిధిని పరామర్శించిన సీఎం చంద్రబాబు
కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. చెన్నై బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి, ఆయన ఆరోగ్య గురించి స్టాలిన్, కనిమొళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్టాలిన్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సీనియర్ నేత వీరమస్తాన్‌రావు కావేరీ ఆస్పత్రికి వచ్చారు. అనంతరం చంద్రబాబు చెన్నై నుంచి తిరుపతికి చేరుకుంటారు.













