డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ఏసియా
మలేసియా బడ్జెట్ ఎయిర్లైన్స్ ఎయిర్ఏసియా మరోసారి డిస్కౌంట్ ఎయిర్ ఛార్జీలతో ముందుకువచ్చింది. దేశీయ రూట్లలో రూ.1099 ఛార్జీతోనే ప్రయాణించే సౌకర్యం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో కూడా రూ.2999ల ధరలను ప్రకటించింది. బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోచి, గోవా, శ్రీనగర్, రాంచి కోల్కత్తా వంటి నగరాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్లు అమలవుతాయి. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీలోపు ఈ టికెట్లు బుక్చేసుకోవాలి. ప్రయాణాలకు జనవరి 15 2018 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకూ ప్రయాణించవచ్చు. ఎయిర్ఏసియా దేశంలోని 15 నగరాలకు ఎ320 విమానాలు పది సర్వీసులు నడుపుతోంది. ఈ బిగ్సేల్తో మొత్తం ఆసియాలో 120 స్టేషన్లకు చేరవ అవుతాయని, ఆస్ట్రేలియాకు సైతం చేరువ కాగలమని కంపెనీ ప్రకటించింది.













