ట్రంప్ పై దాడి ఘటన విచారణ..
పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ప్రచార ర్యాలీ సందర్భంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం నిందితుడిగా 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ షూటర్‌గా గుర్తించింది. ఇదే విషయాన్ని FBI ఫాక్స్ న్యూస్ డిజిటల్‌కి ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు…దర్యాప్తులో సహాయపడే సమాచారం ఉన్న ఎవరైనా FBI.gov/butlerలో ఆన్లైన్లో ఫోటోలు లేదా వీడియోలను సమర్పించమని లేదా 1-800-CALL-FBIకి కాల్ చేయాలని సూచించింది. ర్యాలీలో కాల్పులు జరిగిన తర్వాత అధ్యక్షుడు బిడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు.ఇదే విషయాన్ని వైట్ హౌస్ కార్యాలయం వెల్లడించింది. మరోవైపు.. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ఇవాంక ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
"పెన్సిల్వేనియాలో జరిగిన ట్రంప్ ర్యాలీలో ఏమి జరిగిందో చూసి నేను భయాందోళనకు గురయ్యామన్నారు సెనెట్ మెజారిటీ నాయకుడు షుమర్. అయితే మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉండడంతో ఊపిరిపీల్చుకున్నట్లు తెలిపారు.తమ దేశంలో రాజకీయ హింసకు చోటు లేదన్నారు. మరోవైపు ట్రంప్ పై కాల్పుల ఘటనను… రిపబ్లికన్లు రాజకీయంగాను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దాడి జరిగిన తర్వాత ట్రంప్.. ఫైట్ అంటూ పిడికిలి బిగించి, తమ కేడర్, నాయకులకు చూపించారు. ఇక దీన్ని ప్రచారాస్త్రం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.
అయితే మరీ ఇండియాలో పరిస్థితులు ఉండవు కాబట్టి.. అక్కడి అమెరికన్లు దీన్ని ఎలారిసీవ్ చేసుకుంటారో అన్నది వేచిచూడాలి. మరోవైపు..ఈ దాడి ఘటనను విచారణ జరుపుతున్న ఎఫ్ బీఐ.. దీని వెనక ఎవరైనా ఉన్నారా.. ఎలాంటి మోటో ఉంది అన్నకోణంలోనూ విచారణ జరుపుతోంది. ఇది కూడా వేగంగా తేలిపోయే అవకాశముంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నికలకు ముందుగానే దీని రిజల్ట్ వచ్చే అవకాశముంది.. ఎందుకంటే.. ఇది ఎన్నికల్లో కీలకపాత్ర పోషించకుండా అధికార పార్టీ జాగ్రత్త పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి.






