‘రామ్ లల్లా’ దర్శన భాగ్యం…..
జగదభిరాముడు, ఇనకుల వంశజుడు, శ్రీసీతారాముని దివ్య,భవ్య మందిరం దర్శన భాగ్యం.. త్వరలోనే అందరికీ కలగనుంది. అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరం….వచ్చే నెలలో ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఆహ్వానించే వారి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీని కూడా శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. జనవరి 15 నుంచి 24 వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు 98 శాతం పూర్తి కాగా.. తొలి అంతస్తు పనులు 60 శాతం వరకు పూర్తయ్యాయి.
వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. విగ్రహాలను ప్రతిష్ఠించి రామ మందిరాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్మాణ కమిటీ నిర్ణయించింది. తాజాగా ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేశారు. రామ్‌లాలాను ప్రతిష్టించే చోటు ఈ ఫోటోల్లో కనబడుతోంది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవ వేడుక కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
51 అంగుళాల ఎత్తుతో బాలుడి రూపంలో రాముడి విగ్రహం తయారు చేశారు.బాలుడి రూపంలో ఉండే రాముడు ధనస్సు, విల్లు ధరించి.. కమలంపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తారు.అయోధ్యలోని రామ మందిరం గర్భగుడి లోపల ఎనిమిది అడుగుల ఎత్తున్న బంగారు పూత పూసిన పాలరాతి సింహాసనంపై రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచుతారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, రాజస్థాన్‌లోని కళాకారులు సింహాసనాన్ని నిర్మిస్తున్నారు .. ఇది
డిసెంబర్ 15 నాటికి అయోధ్యకు చేరుకుంటుంది. సింహాసనం ఎనిమిది అడుగుల పొడవు, మూడు అడుగుల పొడవు మరియు నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటుంది. డిసెంబరు 15 నాటికి రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్‌ను సిద్ధమవుతుందని ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.మొదటి అంతస్థు దాదాపుగా పూర్తయిందని చెబుతున్నారు. మొదటి అంతస్తులో 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. “మొదటి అంతస్తులో 19 స్తంభాలు ఏర్పాటు చేయబడ్డాయి డిసెంబర్ 15 నాటికి మొదటి అంతస్తు పైకప్పును నిర్మించాలని భావిస్తున్నారు,” ట్రస్టు ప్రతినిధి మిశ్రా జోడించారు. పరిక్రమ మార్గ్‌లోని ఫ్లోరింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం గృహ మండపం నేలపై మార్బుల్ వేసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.













