మైక్ పెన్స్ ఔట్…
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసు నుంచి మైక్ పెన్స్ తప్పుకున్నారు. లాస్ వేగాస్‌లో జరిగిన రిపబ్లికన్ జెవిష్ కొయిలేషన్ వార్షిక సదస్సులో యూఎస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్లు పెన్స్ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్బంగా మైక్ పెన్స్ మాట్లాడుతూ.. ‘అనేక చర్చల తర్వాత అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా ప్రచార కార్యక్రమాలను మాత్రమే వీడుతున్నాను. సంప్రదాయ విలువలకు కట్టుబడి రిపబ్లికన్ నేతలకు మద్దతుగా ఉంటా. వారి విజయాల కోసం కృషి చేస్తానని మాటిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.
జూన్‌లో పెన్స్ తన వైట్ హౌస్ బిడ్‌ను ప్రకటించారు, అయితే పోల్స్‌లో తక్కువ సింగిల్ డిజిట్లో పడిపోయిన అభ్యర్థిత్వాన్ని కొనసాగించడానికి తగినంతగా ప్రాథమిక ఓటర్లు ,దాతలను ఆకర్షించడంలో విఫలమయ్యారు.అయితే పెన్స్.. ఇక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని నాగరికతతో నడిపించే వ్యక్తిని.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ కోణం నుంచి చూసినప్పుడు పెన్స్ పోరాట యోధుడని హేలీ కొనియాడారు. పెన్స్ “విశ్వసనీయమైన వ్యక్తి” అని డిసాంటిస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే…ట్రంప్ తమ ప్రసంగాలలో పెన్స్ గురించి ప్రస్తావించలేదు,
పెన్స్ 2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఆర్థిక సవాళ్లు, పార్టీ పోలింగ్‌లో వెనుకబడటంతో పెన్స్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ హయాంలో పెన్స్ దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా దేశానికి సేవ చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ర్యాన్ బింక్లీ, టిమ్ స్కాట్ తదితరులు పోటీపడుతున్నారు.
64 ఏళ్ల పెన్స్, జనవరి 6, 2021న U.S. క్యాపిటల్‌లో జరిగిన తిరుగుబాటులో మాజీ అధ్యక్షుడి పాత్రను తప్పుపట్టారు. ట్రంప్ వ్యవహారశైలిపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. వైస్ ప్రెసిడెంట్‌గా, సెనేట్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో…. 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలనే ట్రంప్ సూచనల కంటే రాజ్యాంగాన్ని అనుసరించినందుకు.. రిపబ్లికన్ల మద్దతు లభిస్తుందని పెన్స్ ఆశించారు. అయితే.. తర్వాతి పరిణామాలతో ట్రంప్ .. పెన్స్ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.






