సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల….
2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 7 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు
వెలువడనున్నాయి.ఫేజ్ 1 లో 109, ఫేజ్ 2లో 89, ఫేజ్ 3లో 94, ఫేజ్ 4 లో 96, ఫేజ్ 5లో 49, ఫేజ్ 6లో 57, ఫేజ్ 7లో 57 సీట్లకు పోలింగ్ జరగనుంది.
లోక్సభ ఎన్నికలు 2024 …
మొదటి విడత …
ఎన్నికల నోటిఫికేషన్: 28 మార్చి 2024
నామినేషన్లకు చివరి తేదీ: 2 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 30 మార్చి 2024
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19, 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
తొలి విడత ఎన్నికల్లో ఈశాన్య భారతం, తమిళనాడు, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
లోక్సభ ఎన్నికలు రెండో విడత తేదీలు…
ఎన్నికల నోటిఫికేషన్: 28 మార్చి 2024
నామినేషన్లకు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2024
నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్ 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 8 ఏప్రిల్ 2024
పోలింగ్ తేదీ: 26 ఏప్రిల్ 2024
ఓట్ల లెక్కింపు: జూన్ 4, 2024
రెండో విడతలో ఈశాన్య భారతం, తమిళనాడు, రాజస్తాన్, తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
లోక్సభ ఎన్నికలు మూడో విడత:
నోటిఫికేషన్: 12 ఏప్రిల్ 2024
నామినేషన్లకు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024
నామినేషన్ల పరిశీలన: 20 ఏప్రిల్ 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 22 ఏప్రిల్ 2024
పోలింగ్ తేదీ: 7 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
లోక్సభ ఎన్నికలు నాలుగో విడత తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్: 18 ఏప్రిల్ 2024
నామినేషన్లకు చివరి తేదీ: 25 ఏప్రిల్ 2024
నామినేషన్ల పరిశీలన: 26 ఏప్రిల్ 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 29 ఏప్రిల్ 2024
పోలింగ్ తేదీ: 13 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
లోక్సభ ఎన్నికలు ఐదో విడత తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్: 26 ఏప్రిల్ 2024
నామినేషన్లకు చివరి తేదీ: 3 మే 2024
నామినేషన్ల పరిశీలన: 4 మే 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 6 మే 2024
పోలింగ్ తేదీ: 20 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
జమ్మూకశ్మీర్, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
లోక్సభ ఎన్నికలు ఆరో విడత తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్: 29 ఏప్రిల్ 2024
నామినేషన్లకు చివరి తేదీ: 6 మే 2024
నామినేషన్ల పరిశీలన: 7 మే 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 9 మే 2024
పోలింగ్ తేదీ: 25 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
యూపీ, బీహార్, బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
లోక్సభ ఎన్నికలు ఏడో విడత తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్: 7 మే 2024
నామినేషన్లకు చివరి తేదీ: 14 మే 2024
నామినేషన్ల పరిశీలన: 15 మే 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 17 మే 2024
పోలింగ్ తేదీ: 1 జూన్ 2024
ఓట్ల లెక్కింపు:4 జూన్ 2024
పంజాబ్, ఒడిశా, బీహార్, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గడువు 11 జూన్ 2024న ముగియనుంది. ఇక్కడ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటే
సమాంతరంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగియనుంది. ఇక్కడ మొత్తం 147 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు 2 జూన్ 2024న ముగియనుంది. ఇక్కడ మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సిక్కిం అసెంబ్లీ గడువు 2 జూన్
2024న ముగియనుంది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్..
ఆంధ్ర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు 18 ఏప్రిల్ 2024న నోటిఫికేషన్ వెలువడుతుంది. పోలింగ్ మే 13, 2024న జరుగుతుంది. ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి.
అరుణాచల్ ప్రదేశ్
20 మార్చి 2024న నోటిఫికేషన్ వెలువడుతుంది. 19 ఏప్రిల్ 2024న ఎన్నికలు జరుగుతాయి.
సిక్కిం
20 మార్చి 2024న నోటిఫికేషన్ వెలువడుతుంది. 19 ఏప్రిల్ 2024న ఎన్నికలు జరుగుతాయి.
ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహించనున్నట్టు ఈసీఐ ప్రకటించింది. 2019లో కూడా ఏడు విడతల్లో నిర్వహించింది. ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉండనుందని తెలిపింది.













