8 రాష్ట్రాల సీఎంల కీలక సమావేశం…?
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ విషయంలో కొంతమంది వేయబోయే అడుగుల గురించి అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కొన్ని కొన్ని అంశాల విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కారణంగా కొన్ని రాజకీయ పార్టీలు ఇబ్బందిపడుతున్నాయి. ప్రధానంగా కొంత మంది ముఖ్యమంత్రులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు అనే భావన ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే కేరళ ముఖ్యమంత్రి రాజస్థాన్ ముఖ్యమంత్రి సహా కొంతమంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
ఇతర పార్టీల ముఖ్య మంత్రులు అందరూ కూడా అన్ని విధాలుగా బిజెపి నేతలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మిత్రపక్షంగా ఉన్న పార్టీల అధినేతలను ముఖ్యమంత్రులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేయడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిన అంశం. బీహార్ లో నితీష్ కుమార్ తో కలిసి ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ ని కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారు. క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆదేశాలను పాటించే విధంగా పరిస్థితులు అక్కడ ఉన్నాయి అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగితే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే సీఎం నితీష్ కుమార్ కూడా కొన్ని అంశాలను హైలెట్ చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ విజయం సాధించిన తర్వాత కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి వ్యతిరేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని టాక్. ఈ సమావేశం ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.
దీనికి భారతీయ జనతాపార్టీ మిత్రపక్షాలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీనికి హాజరవుతారు అని అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీల నేతలతో కూడా ముఖ్యమంత్రులు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ అలాగే నితీష్ కుమార్ వంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అని కూడా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక తమిళనాడులో స్టాలిన్ విజయం సాధించే అవకాశాలు దాదాపుగా కనబడుతున్నాయి. దీంతో ఆయనను కూడా కలుపుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉండవచ్చు. కేరళలో మరోసారి ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారం చేపట్టే అవకాశం కనబడుతోంది. వీరందరూ కూడా కలిసి ముందుకు వస్తే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.













