చిక్కుల్లో ‘కేజ్రీవాల్’
లిక్కర్ స్కామ్ విచారణలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ స్కామ్ విచారణలో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. బుధవారం ఉదయం నుంచి సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ ప్రమేయముందంటూ అరెస్టు చూపించారు. దీంతో కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
అయితే…ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఏమీ లభించలేదన్నారు సీఎం కేజ్రీవాల్. గత ఏడాది నుంచి లిక్కర్ స్కాం అంటూ దర్యాప్తు చేస్తున్నారు. వెయ్యి సార్లు సోదాలు చేశారు.. కానీ ఏమీ లభించలేదు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి పరాజయం తప్పదు. ఇదే వీరికి చివరి అవకాశం’ అంటూ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
మరోవైపు…దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఆప్ నేతలకు ఎందుకు భయమైతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. లిక్కర్ స్కాం కేసులో ఏడు నెలలుగా ఆప్ నేత మనీష్ సిసోడియా జైలులోనే గుడుపుతున్నారు.. త్వరలో మరో నేత జైలు కెళ్లబోతున్నారని ఆప్ భయపడుతోందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అంటూ.. ఆప్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు నిర్వహించింది.
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ సైతం కేజ్రీవాల్‌ను కార్నర్ చేస్తోంది. ఇండియా అలయెన్స్‌లో ఉన్నప్పటికీ.. లిక్కర్‌స్కామ్ లభ్దిదారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు సైతం గుప్పించారు. అటు దర్యాప్తు సంస్థల స్పీడు చూస్తుంటే.. నెక్స్ట్ కేజ్రీవాల్‌నే అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నేతలు సైతం ఇదే అంశాన్ని నేరుగా ప్రస్తావిస్తున్నారు.దీంతో ఈలిక్కర్ స్కామ్నుంచి బయటపడేదెలాగో అర్థం కాక ఆప్ సతమతమవుతోంది.













