గ్లోబల్ లీడర్ భారత్…
జి-20 చరిత్రలోనే నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది ఢిల్లీలో జరిగిన సదస్సు. ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉన్న అమెరికా, యూరప్ మరియు రష్యాలను సైతం ఏకతాటిపైకి తెచ్చి.. ఏకాభిప్రాయంతో ఢిల్లీ డిక్లరేషన్ విడుదలైంది. 112 ఫలితాలు, ప్రెసిడెన్సీ పత్రాలతో మునుపటి అధ్యక్షుల కన్నా రెట్టింంపు ఫలితాలను సాధించింది ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్.రాబోయే జి20 అధ్యక్షులకు .. మార్గదర్శకంగా నిలిచింది.భారత్ ఆధ్వర్యంలో జరిగిన జి20 విజయం .. ఓ అసమానమైన విజయం అని చెప్పొచ్చు.
భారత దౌత్య విధానం భేష్..
మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్న దౌత్యవిధానం.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. గతంలో ఏ ప్రధానమంత్రి హయాంలోనూ భారత గళానికి.. అంత మద్దతు లభించిన దాఖలా లేదు. కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దౌత్యవిధానం పూర్తిగా మారిపోయింది. భారత ప్రయోజనాలే ప్రాతిపదికగా, మోడీ సర్కార్ అడుగులేస్తోంది. దీంతో పాత మిత్రులతో స్నేహం మరింత బలపడగా.. కొత్తమిత్రులను సైతం భారత్ తయారు చేసుకుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఇటీవలే జరిగిన జి-20 సదస్సు సందర్భంగా భారత దౌత్యానికి విశేష స్పందన లభించింది. అంతర్జాతీయంగా భారత్ కీలకభూమిక పోషించగలదన్న సత్యం .. ప్రపంచానికి అవగతమైంది.
మోడీ ద లీడర్..
యావత్ సదస్సులో ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ప్రతిపాదించిన డిక్లరేషన్ కు అగ్రరాజ్యాదినేత బైడెన్ , యూరోపియన్ యూనియన్ దేశాధినేతలు సహా అన్నిదేశాలు ఏకాభిప్రాయంతో అంగీకరించాయి. అసలు మోడీ ఇమేజ్ ఎంత ఎత్తుకు ఎదిగిందంటే.. అంతర్జాతీయంగా సౌత్ లో మేటైన నాయకుడిగా మోడీ ఆవిర్భవించారు. మోడీ దార్శనికతను ప్రశంసిస్తూ, పలుదేశాల నేతలు..ఆయన మార్గదర్శకత్వంలో అడుగులు వేసేందుకుఆసక్తి కనబరిచారు.
ఢిల్లీ డిక్లరేషన్..
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మానవ-కేంద్రీకృత అభివృద్ధికి మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఎలా కట్టుబడి ఉన్నాయో ఢిల్లీ డిక్లరేషన్ వివరించింది. మరీ ముఖ్యంగా, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాలు మరియు వాతావరణ పరిరక్షణ చర్యలు మానవాళి ఎదుర్కొంటున్న కొన్ని అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం ప్రపంచదేశాలను ఏకతాటిపైకి తెచ్చింది. ఇదంతా భారత్ సత్తా, మోడీ అనితర సాధ్యమైన ఇమేజ్ తో సాధ్యమైంది.
భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్
మరీ ముఖ్యంగా జి-20 వేదిక నుంచి చైనాకు షాకిచ్చింది భారత్. సౌదీ, యూరోపియన్ యూనియన్ తో కలిసి భారత్ అసాదారణ ప్రణాళిక రచించింది. చైనాతో పటిష్ట సంబంధాలున్న ఈ దేశాలతో కలిసి భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ ను ప్రతిపాదించింది. ఇది ఐరోపా మరియు భారత ఉపఖండం మధ్య అంతరాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది అపూర్వ విజయం.సంబంధిత సభ్య దేశాల మధ్య ఖండాంతర వాణిజ్యంపై పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపించనుంది. దీనికి తోడు చైనా నడవా ఒప్పందం నుంచి తప్పుకునే దిశగా ఇటలీ అడుగులేసింది. భారత్ ప్రతిపాదించిన కారిడార్.. ఓమైలురాయిగా ఇటలీప్రధాని అభివర్ణించారు.
శాంతి సందేశం..
కొంతకాలంగా సౌదీ అరేబియా, అమెరికా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. అయితే, G20 సమ్మిట్ యొక్క మొదటి రోజు, మెగా కారిడార్ ప్రారంభించినప్పుడు… జో బిడెన్ , సౌదీ అరేబియా ప్రధాన మంత్రి , యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో షేక్ హ్యాండిస్తూ కనిపించారు. ఈ అరుదైన సన్నివేశానికి బాటలు వేసింది భారత ప్రధాని నరేంద్ర మోడీ –
కూటముల మధ్య ఏకాభిప్రాయం..
ఉక్రెయిన్‌పై ఏకాభిప్రాయం సాధించడం భారత్‌కు అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి మోడీ స్వయంగా భారతదేశం యొక్క G20 షెర్పా-అమితాబ్ కాంత్‌కు, డిక్లరేషన్ ఫైనల్ ముసాయిదా ఖచ్చితంగా ఉందని – ఇది అన్ని దేశాల ఆందోళనలను ప్రస్తావించిందని సూచించారు. ఈ ఆదేశంతో, అమితాబ్ కాంత్ అన్ని G20 దేశాల షెర్పాలకు, ఉక్రెయిన్‌పై పేరాలతో సహా డిక్లరేషన్ యొక్క తుది ముసాయిదాలో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పారు. డిక్లరేషన్‌తో తమకు సమస్య ఉంటే, తమ నాయకులు వ్యక్తిగతంగా ప్రధాని మోడీతో మాట్లాడవచ్చని షెర్పాలందరికీ సూచించారు. ప్రధానిమోడీ అంతర్జాతీయ ఇమేజ్ కారణంగానే ఈడిక్లరేషన్ సాధ్యపడిందని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు.
ఆఫ్రికన్ యూనియన్ కు సభ్యత్వం..
నేడు, భారతదేశం గ్లోబల్ సౌత్‌లో అగ్రగామిగా పరిగణించబడుతుంది. G20లో ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశం ఈ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈవిషయంలోనూ మోడీసర్కార్.. చాలా కీలకంగా వ్యవహరించింది. ఈప్రభావం రేపటి ఐక్యరాజ్యసమితిలోనూ కనిపించనుంది. భారతదేశం.. ఐక్యరాజ్యసమితి విస్తరణను కోరుతోంది. దీనికి ఇప్పటికే బిడెన్, యూరోపియన్ యూనియన్ సహా పలుదేశాలు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కూడా భారత్ పక్షంగా మారనుంది.
మోడీతో పెద్దన్న…
కొన్నేళ్లుగా భారత్ కు దగ్గరవుతున్న పెద్దన్న అమెరికా.. ఈబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. మోడీతో బైడన్ 5 కీలక ఒప్పందాలు చేసుకున్నారు. సాదారణంగా అమెరికా అధ్యక్షులు.. ఎంతసేపు తమ ప్రాభవంపైనే ఫోకస్ పెడుతుంటారు. కానీ ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు బిడెన్.. మోడీతోనే మసలుతూ కనిపించారు. మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా జి20 సదస్సు విజయవంతం కావడంపై ..ఆయన ట్వీట్లు చేస్తూ వచ్చారు.
డిఫెన్స్ డీల్స్ పై..
ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ తో మోడీ భేటీ.. ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసిందనే చెప్పాలి. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ సంబంధాల మెరుగుదలకు ఇద్దరు నేతలు ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. అత్యాధునిక, మెరుగైన రక్షణ సాంకేతిక నైపుణ్యం, వేదిక, మేకిన్ ఇండియాపైనా చర్చించినట్లు తెలుస్తోంది. డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్ ను త్వరలోనే పట్టాలెక్కిస్తామని సంయుక్తప్రకటనలో ఇద్దరు నేతలు తెలిపారు.
జీవ ఇంధనకూటమి ఏర్పాటు…
జీ20 వేదికగా జీవ ఇంధనకూటమి ఏర్పాటు దిశగా ముందడుగు పడింది. అమెరికా సహా పలు దేశాలు ఈకూటమిలో చేరాయి. సాంకేతిక పురోగతిని సులభతరం చేయడం, స్థిరమైన జీవ ఇంధనాల వినియోగాన్ని తీవ్రతరం చేయడం దీని లక్ష్యం. విస్తృత శ్రేణి వాటాదారుల భాగస్వామ్యం ద్వారా బలమైన ప్రామాణిక సెట్టింగ్ మరియు ధృవీకరణను రూపొందించడం ద్వారా జీవ ఇంధనాల ప్రపంచవ్యాప్త ఉపసంహరణను వేగవంతం చేయాలని అలయన్స్ భావిస్తోంది.
ఇక ఈసదస్సు విజయం ఎలా ప్రకాశించిందంటే .. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకానప్పటికీ.. తనప్రధానమంత్రిని పంపారు. అంతేకాదు.. శిఖరాగ్రసదస్సు విజయవంతమైందని చైనా ప్రశంసించింది. మరోవైపు దేశ సమస్యలతో పుతిన్ హాజరు కానప్పటికీ…. సదస్సువిజయవంతం కావడంపై ప్రశంసలు కురిపించారు. ఓవైపు భారత్ ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంటే.. చైనా దేశంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది.
అంతే కాదు పలుదేశాల షెర్పాలు సైతం సదస్సు విజయవంతానికి మోడీ అనితర సాధ్యమైన వ్యూహరచనే కారణమని ప్రశంసిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయా దేశాధినేతలతో ఉన్నపరిచయాలతోనే ఇది సాధ్యమైందంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించినా, చైనాను పట్టించుకోకున్నా.. ఆయా దేశాలు సైతం ఈ డిక్లరేషన్ కు మద్దతిచ్చాయంటే.. మోడీ ఏస్థాయిలో వర్కవుట్ చేశారో అర్థమవుతోంది. ఇక మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. ఈవిజయం ఓ అద్భుతమని తెలిపారు. శశిధరూర్ అయితే భారత విజయం అసామాన్యమంటూనే.. ఇది బీజేపీ విజయం కాదంటూ ముక్తాయించారు.
ఇక అంతర్జాతీయంగా సమర్థులైన లీడర్ల విషయానికొస్తే మోడీ.. ఏకంగా 66 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ప్రస్తుతం అగ్రరాజ్యాల అధినేతలు ఎవరూ మోడీ దరిదాపుల్లోకి రావడం లేదు. అంతెందుకు వివిధ సోషల్ మీడియాల్లో మోడీని కోట్లాది మంది ఫాలో అవుతున్నారు. ఆఖరికి చైనాలో కూడా మోడీ కోట్లాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే మోడీ .. చైనా సోషల్ మీడియాలో తన అకౌంట్ క్లోజ్ చేయడంతో వారు వేర్వేరుగా సైట్లలో మోడీని అనుసరిస్తున్నారు. దటీజ్ నమో.. దటీజ్ మోడీ బ్రాండ్..













