ఐటీ ఇండస్ట్రీకి ట్రంప్ కామెంట్స్ టెన్షన్..
అమెరికా మాజీఅధ్యక్షుడు ట్రంప్.. తాను మళ్లీ ఎన్నికైతే ఔట్‌సోర్సింగ్‌ను అంతం చేస్తానని హామీ ఇచ్చారు, "ఔట్‌సోర్సింగ్‌ను ఆపడం, యునైటెడ్ స్టేట్స్ను ఉత్పాదక సూపర్‌పవర్‌గా మార్చాలంటూ….రిపబ్లికన్ పార్టీ మూడో సమావేశానికి ముందు ఈ ప్రకటన విడుదలైంది. 20 వాగ్దానాల జాబీతాను..ప్రతీ ఓటరుకు అర్థమయ్యేలా రూపొందించారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలన్నదే ట్రంప్ దృష్టి అని .. ట్రంప్ ప్రచార సలహాదారులు లాసివిటా, సూసీ వైల్స్ తెలిపారు.
ట్రంప్ ప్రకటన.. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ బిజినెస్ కు కష్టకాలంగా పరిణమించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా US అతిపెద్ద కస్టమర్ అయిన భారతదేశపు బహుళ-బిలియన్ డాలర్ల అవుట్సోర్సింగ్ పరిశ్రమ అంతటా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. అవుట్‌సోర్సింగ్‌ను ముగించే వాగ్దానంతో భారత కంపెనీలు ఆందోళనకు గురయ్యాయి. అవుట్సోర్సింగ్ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించిన భారతీయ కంపెనీలకు ఇది తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అవుట్ సోర్సింగ్, టార్గెట్ అరికట్టేందుకు తన మొదటి టర్మ్ లో ట్రంప్ ప్రకటించిన చర్యలను గుర్తుకు తెస్తోందని వాణిజ్యవర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా హై-స్పెషాలిటీ ఉద్యోగాల కోసం స్థానికంగా లభించే మానవ వనరుల కొరతను భర్తీ చేయడానికి అమెరికన్ కంపెనీలు ఉపయోగించే H-1B వీసా ప్రోగ్రామ్‌ను లక్ష్యంగా చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఔట్సోర్సింగ్ పరిశ్రమ పొందుతున్న వ్యాపారంలో 62 శాతం US ఖాతాలో ఉంది. ఫోర్డ్ మోటార్స్, సిస్కో, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (అమెక్స్), జనరల్ ఎలక్ట్రిక్స్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు భారతీయ కంపెనీలకు అవుట్సోర్స్ చేసిన US కంపెనీలలో ఉన్నాయి. గ్లోబలైజ్డ్ ఎకానమీలో విదేశాలకు తక్కువ వేతనాలు కలిగిన దేశాలకు ఉత్పాదక ఉద్యోగాలు పంపిణీ చేస్తున్న తరుణంలో అమెరికా అభ్యర్థుల దృష్టి ఔట్సోర్సింగ్ మరియు ఆఫ్షోరింగ్కు వ్యతిరేకంగా ఉండడం ఓరకంగా ప్రమాద సంకేతాలని చెప్పవచ్చు.మరోవైపు…ప్రెసిడెంట్ జో బిడెన్ 2020 ఎన్నికల కోసం తన ప్లాట్‌ఫారమ్‌లో ఆఫ్‌షోరింగ్ టాక్స్ పెనాల్టీకి పిలుపునిచ్చారు.






