మంత్రి సవాల్ విషయంలో టీడీపీ తప్పు చేసిందంటారా…?
తిరుపతి ఉప ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఎంత కీలకంగా ఉన్నాయి ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కొన్ని కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే అభిప్రాయం కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కీలక అంశాల్లో చంద్రబాబునాయుడు స్పందించే విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఉన్న అంశాలను చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకోవాలి.
కానీ ఆయన ఎప్పటిలాగానే తన రాజకీయ చేయడంతో పార్టీలో ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు తిరుపతి పరిధిలో అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన సవాల్ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు పై కార్యకర్తలలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటివరకు కూడా పార్టీ గెలుస్తుంది అని చాలా మంది కార్యకర్తలు తిరుపతి పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇక రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా వాడుకోలేకపోయింది. అయితే ఆ సవాల్ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించిన తీరు పై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రం కోసం రాజీనామా చేద్దాం, ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేద్దాం, విశాఖ ఉక్కు కోసం చేద్దాం అంటూ అనవసర మాటలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు.
దీనివలన పార్టీ కార్యకర్తల్లో అసలు గెలుస్తామా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన సవాల్ వైసీపీ కి మంచి ఉత్సాహాన్ని తీసుకు వస్తే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది. సవాల్ స్వీకరించినా బాగానే ఉండేది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాని దీనిని తెలుగుదేశం పార్టీ వాడుకోలేక ఇప్పుడు అనవసరంగా పరువు పోగొట్టుకుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు తిరుపతి లో ఏ విధంగా మారతాయో చూడాలి. అంతే కాకుండా చాలా మంది కార్యకర్తలకు ఇప్పుడు భరోసా కల్పించే నాయకత్వం కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలో కనబడటంలేదు. కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చే ప్రసంగం కూడా చాలామంది నాయకులు చేయలేక పోతున్నారు.













