నిత్యానంద బిల్డప్పులు మామూలుగా లేవుగా?
నిత్యానంద.. ఈ పేరు తెలియని వారు ఉండరు. నిత్య వివాదాలతో ఎంతో పేరుందారు. తనను తాను స్వయం ప్రకటిత భగవంతుడిగా చెప్పుకున్నారు. సమస్త భూగోళడానికి తానే అధిపతినని ప్రగల్భాలు పలుకుతుంటారు. భారత్లో అనేక వివాదాలు, కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయాడు. కొన్నాళ్లపాటు ఎక్కడ ఉన్నాడో, చేస్తున్నాడో కూడా తెలియలేదు. అయితే సడన్గా ఒకరోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. తాను ఒక దీవిని కొన్నానని, దానికి కైలాస దేశంగా పేరు పెట్టానని ప్రకటించాడు. ఒక దేశానికి కావలసిన అన్ని అర్హతలు కైలాస కు ఉన్నాయని చెప్పాడు. కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ, రిజర్వు బ్యాంకు లాంటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పాడు.
అసలు ఈ కైలాస దేశం ఏంటో, నిత్యానంద ఏం చేస్తున్నాడో అర్థం కాక జనాలు నవ్వుకున్నారు. సాధారణంగానే నిత్యానంద స్పీచ్ లు నవ్వు తెప్పిస్తుంటాయి. సైన్స్ కి, తర్కానికి ముడిపెట్టి ఏవేవో మాట్లాడుతుంటాడు. దీంతో నిత్యానంద ఒక జోకర్ లాగా గుర్తింపు పొందాడు. అయితే ఏకంగా ఒక దేశాన్ని ఏలేంత స్థాయికి ఎదిగానని ప్రకటించడంతో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయి. కైలాస దేశానికి రావాలంటే వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం మరింత నవ్వు తెప్పించింది. కానీ కైలాస అనేది ఒక నిజమని, దానికో మనుగడ ఉందని ఈమధ్యే వెలుగులోకి వచ్చింది. సడన్గా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కైలాస ప్రతినిధులు ప్రత్యక్షం కావడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కైలాస దేశం తరఫున మా విజయ ప్రియ నిత్యానంద ప్రత్యక్షమయ్యారు. ఏకంగా భారతదేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశం తమను తొక్కేస్తోందని, తమ హక్కులను కాల రాస్తోందని, కైలాస దేశానికి భారతదేశ నుంచి ముప్పు ఉందని, తమకు రక్షణ కావాలని గొంతెత్తింది. దీంతో సభ్య దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. అసలు ఈ కైలాస దేశానికి ఐక్యరాజ్యసమితి ఎలా పర్మిషన్ ఇచ్చింది.. ఇక్కడి వరకు వాళ్లని ఎలా అనుమతించింది.. అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై లోతుగా విచారణలు చేయడంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
వాస్తవానికి కైలాస దేశానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఇవ్వలేదు. ఒక దేశానికి ఉన్న అర్హతలు ఏవి కైలాస దేశానికి ఉన్నాయో లేదో ఇప్పటికీ తెలియదు. అసలు కైలాస దేశం ఉందో లేదో కూడా అంత చిక్కడం లేదు. కానీ కైలాస దేశ ప్రతినిధులు దేశం తరఫున కాకుండా ఒక పౌర సమాజ సంస్థ తరఫున ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన సి ఈ ఎస్ ఆర్ లోకి అడుగు పెట్టారు. అక్కడ తమ గళం వినిపించారు. వాస్తవానికి ఇందులో పాల్గొనాలంటే గుర్తింపు పొందిన పౌర సంస్థలు అయితే చాలు. ఇక్కడ కైలాస ప్రతినిధులు కూడా ఇలాగే ఎంటర్ అయ్యారు. కైలాస యూనియన్ పేరుతో రిజిస్టర్ అయిన ఒక పౌర సంస్థ ముసుగులో అడుగుపెట్టి భారతదేశంలో అక్కకి వెళ్ళగక్కారు. తమ దేశానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపునిచ్చిందంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. నిత్యానంద బిల్డప్పులు చూసి అందరూ మరోసారి ఆశ్చర్యపోయారు. వీడు మాయగాడు అంటూ ఇప్పుడు నోరు వెళ్ళబెడుతున్నారు.













