గుజరాత్ కమలానిదే..! హిమాచల్ లో హంగ్..!?
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు కాస్త తెరపడింది. ఎగ్టిట్ పోల్స్ వచ్చేశాయ్. గుజరాత్ మళ్లీ బీజేపీకే పట్టం కట్టబోతున్నట్టు ఎగ్టిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం నువ్వా నేనా అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు నడుస్తున్నట్టు తేలుతోంది. గుజరాత్ ను ఈసారి బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఈసారి చేజారిపోతుందేమోననే భయం బీజేపీకి పట్టుకుంది. అందుకే ప్రధాని హోదాలో ఉన్నా.. మోదీ అన్నీ తానై వ్యవహరించారు. నెలలో మూడుసార్లు గుజరాత్ లో పర్యటించి ప్రచారం చేశారు. దీన్నిబట్టి గుజరాత్ లో గెలుపును బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూస్తే బీజేపీ కచ్చితంగా విజయం సాధించబోతున్నట్టు తెలుస్తోంది. గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ సీట్లు ఈసారి భారీగా తగ్గనున్నట్టు తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వెళ్లిపోవడం, బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అడ్డుకోవడం లాంటి కారణాలు కాంగ్రెస్ పార్టీ అంచనాలకు గండి కొట్టినట్టయింది. దీంతో బీజేపీ లబ్ది పొందినట్లు తేలుతోంది.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ హిమాచల్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేకపోయాయి. ఇక్కడ బీజేపీకి ఒకటిరెండు సీట్లు ఎక్కువగా వస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ లో కనిపిస్తున్నా…వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయోనని బీజేపీకి భయం పట్టుకుంది. అటు కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ పై ఆశలు లేవు. హిమాచల్ లో గట్టి ఫైట్ ఇచ్చింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ పై కాంగ్రెస్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
గుజరాత్ ఎగ్జిట్ పోల్స్
రిపబ్లిక్ టీవీ:
బీజేపీ 128-148
కాంగ్రెస్ 30-42
ఆప్ 2-10
ఇతరులు 0-3
న్యూస్ X
బీజేపీ 117-140
కాంగ్రెస్ 34-51
ఆప్ 6-13
ఇతరులు 1-2
జన్ కీ బాత్:
బీజేపీ 117-140,
కాంగ్రెస్ 34-51
ఆప్ 6-13,
ఇతరులు 0
టీవీ 9:
బీజేపీ 125-130,
కాంగ్రెస్ 40-50
ఆప్ 3-5
ఇతరులు 0
P – Marq
బీజేపీ 128-148,
కాంగ్రెస్ 30-42
ఆప్ 2-10
ఆత్మసాక్షి :
బీజేపీ 98-110,
కాంగ్రెస్ 66-71,
ఆప్ 9-14,
ఇతరులు 2-6
పీపుల్స్ పల్స్ :
బీజేపీ 125-143,
కాంగ్రెస్ 30-48,
ఆప్ 3-7
ఇతరులు 2-6
హిమాచల్ ప్రదేశ్
రిపబ్లిక్ టీవీ
బీజేపీ 34-39,
కాంగ్రెస్ 28-33,
ఆప్ 0-1,
ఇతరులు 1-4
టైమ్స్ నౌ:
బీజేపీ 38,
కాంగ్రెస్ 28
ఆప్ 0
ఇతరులు 2
జన్ కీ బాత్:
బీజేపీ 32-40,
కాంగ్రెస్ 27-34,
ఆప్ 0,
ఇతరులు 1-2
జీ న్యూస్:
బీజేపీ 35-40,
కాంగ్రెస్ 20-25,
ఇతరులు 0-3
ఆత్మసాక్షి :
బీజేపీ 31-35,
కాంగ్రెస్ 33-36,
ఆప్ 2-3,
ఇతరులు 2-3
పీపుల్స్ పల్స్ :
బీజేపీ 29-39,
కాంగ్రెస్ 27-37,
ఆప్ 0,
ఇతరులు 2-5













