Antony Blinken: ట్రంప్ గాలి తీసేసిన అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్..
రోజుకో వివాదాస్పద ప్రకటనతో శత్రు, మిత్ర దేశాలని తేడాలేకుండా నిద్రలేకుండా చేస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్(Trump) నకు.. ఆదేశ విదేశామంత్రి బ్లింకెన్ గట్టి షాకిచ్చారు. అసలు ట్రంప్ మాటలు పట్టించుకోవద్దని మిత్రదేశాలకు సూచించారు. అంతేకాదు..గ్రీన్ ల్యాండ్(Green land) విలీనమయ్యేపరిస్థితి లేదన్నారు. ట్రంప్ కలలు వాస్తవమయ్యే పరిస్థితి లేదన్నారు అమెరికా విదేశాంగమంత్రి. దాని గురించి ఆలోచించడం కూడా టైమ్ వేస్ట్ అని పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకొంటానన్న డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు పట్టించుకొని టైమ్ వేస్టు చేసుకోవద్దని ప్రపంచ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సూచించారు. అసలు అది జరిగే పని కాదులే అని తీసిపారేశారు.మిత్ర దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తుందని.. వాటితో బంధాన్ని బలోపేతం చేసుకొంటుందని బ్లింకెన్ వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఇదే కోరుకుటున్నారని చెప్పారు. ‘‘గ్రీన్ ల్యాండ్ విలీనం ఐడియా అసలు మంచిది కాదు. కానీ, ముఖ్యమైంది. సహజంగానే విలీనం జరిగే పనికాదు. అందుకే.. మనం దాని గురించి మాట్లాడి సమయం వృథా చేయొద్దు.
మిత్రులతో కలిసి పనిచేస్తే మేము మరింత బలంగా ఉంటామని.. మెరుగైన ఫలితాలు సాధిస్తామని బైడెన్ కార్యవర్గం నమ్ముతుంది. అంతేకానీ, వారిని దూరం చేసుకొనే పనులు, వ్యాఖ్యలు చేయం’’ అని మిత్ర దేశాలకు వెల్లడించారు. ఆ సమయంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియోన్ నోయల్ బార్రోట్ కూడా అక్కడే ఉన్నారు. ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని ఎవరు ఉల్లంఘించినా ఊరుకోమని ఫ్రాన్స్ విదేశాంగమంత్రి ఇప్పటికే హెచ్చరించారు.
ఎన్నికల్లో విజయం ధ్రువీకరణ జరిగిన తర్వాత ఫ్లోరెడాలో ట్రంప్ విలేకర్లతో ఇష్టాగోష్టీలో మాట్లాడుతూ.. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం అంశాన్ని ప్రస్తావించారు. ఇందుకోసం సైన్యాన్ని కూడా వినియోగించే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పారు. ఈనెల 20వ తేదీన ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన హయాంలో విదేశాంగ విధానంలో పెనుమార్పులు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






