శ్రీవారి భక్తులకు సంక్రాంతి కానుక
సంక్రాంతి కానుకగా భక్తకోటి కోరినన్ని లడ్డూలు విక్రయించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. ఇది వరకు నిత్యం 5 వేలవరకు అదనపు లడ్డూలు విక్రయిస్తుండగా మొదటి దశలో 20 వేలకు పెంచింది. రెండో దశ కింద 30వేలకు పెంచగా లడ్డూలు మిగులుతుండడం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఒక్కో యాత్రికుడికి రెండు వంతున విక్రయిస్తుండగా, పదికి పెంచలని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ పరిమితిని కూడా ఎత్తివేసి కోరినన్ని కొనుగోలుకు అవకాశం కల్పించాలని సంకల్పించింది. సంక్రాంతి నుంచి దీన్ని ఆచరణలోకి తీసుకురావాలని భావిస్తోంది.













