ప్రపంచ శాంతికి సభ్య దేశాలన్నీ కృషి చేయాలి
ప్రపంచ శాంతిని కాపాడేందుకు ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలన్ని సమష్టిగా కృషి చేయాలని పార్లమెంట్లో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు. న్యూయార్క్ నగరంలో ఆరురోజులుగా జరుగుతున్న యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ సమావేశాల్లో 193 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ తరపున హాజరైన జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని పలు దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, ఇది సరైన విధానం కాదన్నారు. పేదరికం, వలసలు, నిరక్షరాస్యత నిర్మూలన, వైద్య రంగాల్లో కొన్ని పరిస్థితుల కారణంగా పలు దేశాలు వెనుకబడి ఉన్నాయని, ఆ దేశాలకు ఐక్యరాజ్య సమితితోపాటు సభ్యదేశాలన్నీ అండగా నిలువాలని సూచించారు. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి స్థానానికి భారత్‌కు చెందిన బండారికి మద్దతుగా నిలిచి ఓటు వేయాలని సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.













