తానా ఆధ్వర్యంలో మార్చి 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీన ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. మాల్వెర్న్లోని ఛార్లెస్ టౌన్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మీదేవినేని, ఉమెన్స్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, తానా మిడ్ అట్లాంటిక్ ఉమెన్స్ కో ఆర్డినేటర్ సరోజ పావులూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకల్లో పాల్గొనదలచినవారు కుటుంబానికి 10 డాలర్లు, సింగిల్‌గా అయితే 5 డాలర్లు చెల్లించాలి. రాణి తుమ్మల, సునీత, లక్ష్మీ అద్దంకి, సునీత నలజుల, విజయ జరుగుల, రాజేశ్వరి కంతేటి, భవాని క్రొత్తపల్లి, కవిత మందలపు, కృష్ణజ నందమూరి, ఇందు పొట్లూరి, బిందు కోయ, రూప కోగంటి, తేజ మల్ల, స్వరూప, యశోద, భవాని మామిడి, అనుపమ యలమంచి, జయ, విజయశ్రీ పరుచూరి తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడుతున్నారు.













