కాణిపాకం బ్రహ్మూెత్సవాలకు సీఎంకు ఆహ్వానం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మూెత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం అందింది. దేవస్థాన పాలక మండలి సభ్యులు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మూెత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం కాణిపాకం వినాయక స్వామి ఆలయ పండితులు చంద్రబాబుకు ఆశీర్వచనం పలికి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. సెప్టెంబర్ 13 నుంచి అక్టోబరు 3 వరకు బ్రహ్మూెత్సవాలను నిర్వహించనున్నారు. వినాయక చవితి వార్షిక బ్రహ్మూెత్సవాలలో భాగంగా బాధ్రపద శుద్ధ చతుర్ధి వినాయక చవితి రోజ నుంచి 21 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కాణిపాకం ఆలయ పాలక మండలి చైర్మన్ వి.సురేంద్రబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులపర్తి నాని, టీడీపీ మహిళా నేత లలిత కుమారి తదితరులు ఉన్నారు.













