రాక్షసుడు టైటిల్ ఫిక్స్
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానియకి రాక్షసుడు టైటిల్ ఖరారు చేశారు. ఉగాది పర్వదినాన టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళ హిట్ రాక్షసన్ కు రీమేక్ ఇది. హవీశ్ లక్ష్మణ్ నిర్మాణ సారథ్యంలో ఏ స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్న కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ విభిన్న కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికి 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత దర్శకుడు.













