ఉత్తరప్రదేశ్ సీఎం కీలక నిర్ణయం.. మరో మూడు నెలలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత రేషన్ స్కీమ్‌ను మరో మూడు నెలలు పొడిగించారు. యోగి నేతృత్వంలోని క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. పేదలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు అందాలన్నది తమ ఉద్దేశమని డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ తెలిపారు. సీఎం యోగీ నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్ అందనుంది. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ స్కీమ్‌ను కొనసాగించిన విషయం తెలిసిందే.













