భారత్కు ప్రపంచ దేశాల మద్దతు
గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణ విషయంలో ప్రపంచ దేశాల నుంచి భారత్కు మద్దతు పెరుగుతున్నది. 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సంతాపం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీలోని అమెరికా రాయబారి కెన్ జస్టర్ సైతం సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. జవాన్ల ధైర్యసాహసాలు మరువలేనివని ట్వీట్ చేశారు. అమెరికా విదేశాంగ శాఖ ఇదివరకే సంతాపం తెలిపింది. భారత్, చైనా మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దూల్లా షాహీద్ ట్వీట్ చేస్తూ.. జవాన్ల మృతిపై భారత ప్రజలకు తన ప్రగఢ సానూభూతి తెలిపారు. మరో వైపు ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్ కూడా భారత్కు మద్దతు ప్రకటించాయి. భారత్లోని ఆయా దేశాల రాయబారులు.. భారత సైనికుల మృతిపై సంతాపం ప్రకటించారు.













