మౌనాన్ని బలహీనత అనుకోవద్దు: మహారాష్ట్ర సిఎం
కంగనా వివాదాస్పద కామెంట్స్, ఆఫీసు ధ్వంసం వీటన్నింటి నేపధ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాకరే స్పందించారు. ఇలాంటి విషయాలపై తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. ముంబైని అపఖ్యాతి పాలు జేయాలనేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి రాజకీయ కుట్రకూ బెదిరేది లేదని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన ఆలోచన మొత్తం కరోనా కట్టడిపైనే ఉందన్నారు. తాము తీసుకున్న చర్యల వల్ల మహారాష్ట్రలో కరోనా అదుపులోకి వస్తోందని చెప్పారు.













