బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం… యూకే నుంచి వచ్చే విమానాలు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూకే నుంచి కోల్కత్తా ఎయిర్పోర్టుకు వచ్చే అంతర్జాతీయ విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే హైరిస్క్ ఉన్న దేశాల విమానాల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ఆంక్షలు జనవరి 3 వరకూ అమలులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కరోనా నెగెటివ్ రిపోర్టు తప్పని సరి అని బెంగాల్ సర్కార్ తేల్చి చెప్పింది.













