వాళ్లు ఇక్కడికి రావొద్దు.. రాయల్ బెంగాల్ టైగర్ ఉంది
2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సంరద్భంగా మమతా మాట్లాడుతూ కేంద్రంలో అసమర్థ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా అనుకూల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అందుకోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ తిరస్కరణ ఎన్నికలు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీకి బుర్ర పని చేయడం లేదని, మరమరాలు, స్వీట్లు, లస్సీ, పెరుగు వంటి ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ బాధితే ప్రజలు ఏం తిన్నాలని ప్రశ్నించారు. అనారోగ్యంతో ప్రజలు ఆస్పత్రిలో చేరినా దానికి కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. వాళ్లు ముంబైని విడగొగ్టామని భావిస్తున్నారు. తర్వాత ఛత్తీస్‌గఢ్‌ను పడగొడతారు. ఆ తర్వాత బెంగాల్ వస్తారు. ఇక్కడికి రావొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది అన్నారు.













