నాపై విమర్శలు చేసినా సరే కానీ..రాష్ట్రాన్ని ఎవరైనా కించపరిస్తే కచ్చితంగా
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై దాడిని సాకుగా చూపించి, శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ కొందరు రాష్ట్రాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కోల్కతాలో నిర్వహించిన స్టూడెంట్స్ వీక్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. దేశంలోనే కోల్కతా అత్యంత సురక్షితమైన నగరమని, నేషనల్ క్రైమ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డులే ఈ అంశాన్ని నిరూపిస్తున్నాయన్నారు. నాపై విమర్శలు చేసినా బాధపడను. కానీ, రాష్ట్రాన్ని ఎవరైనా కించపరిస్తే కచ్చితంగా ప్రతిఘటిస్తాను అని పేర్కొన్నారు.













