ఖర్గే స్థానంలో… ఆయన ఉంటే బాగుంటుంది : ధన్‌ఖడ్

రాజ్యసభలో మరోసారి వాడీవేడీ వాతావరణం నెలకొంది. చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. ఖర్గే వ్యవహరిస్తూన్న తీరును తప్పుబట్టిన ధన్‌ఖడ్, చైర్మన్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే స్థానంలో జైరా రమేశ్ కూర్చుంటే బాగుంటుందన్నారు. చైర్మన్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. సమావేశం మధ్యలో తరచూ లేచి మీకు తోచింది మాట్లాడుతున్నారు. అయినా, మీ గౌరవాన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నించా అని ఖర్గేపై మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఏదో చెప్పడానికి లేచి నిలబడితే చైర్మన్ ఆయన్ను వారించారు. మీరు చాలా తెలివైనవారు. ప్రతిభావంతులు, ఖర్గే చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. వచ్చిన ఆయన స్థానంలో కూర్చోండి అని ధన్‌ఖడ్ సూచించారు. దీనిపై ఖర్గే స్సందిస్తూ.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ స్థానం కల్పించారు. బాధ్యతలు అప్పగించారు. ఆమె వల్లే నేను ఇక్కడ కూర్చున్నా అని బదులిచ్చారు.