ప్రత్యేక ఆకర్షణగా అమెరికా ఎఫ్-13ఏ ఫైటర్ జెట్లు
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా-2023 ను ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన ఐదో తరం సూపర్‌సానిక్ మల్టీరోల్ ఎఫ్-35ఏ యుద్ధవిమానానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎఫ్-35ఏ లైట్నింగ్-2, ఎఫ్-13ఏ జాయింట్ స్రైక్ ఫైటర్ అమెరికాలోని ఎయిర్‌బేస్‌ల నుంచి బెంగళూరుకు చేరుకున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందినీ అత్యాధునిక ఫైటర్ జెట్లు భారత్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్, ఎఫ్/ఏ-18ఈ, ఎఫ్/ఏ-18ఎఫ్ యుద్ధ విమానాలు సైతం అమెరికా నుంచి వచ్చాయి.













