ప్రపంచంలో నేను ఎక్కడా దీనిని… పొందలేకపోవచ్చేమో
భారత ప్రభుత్వం నుంచి లభించిన ఆహ్వానంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆనందం వ్యక్తం చేశారు. తమ రెండు దేశాల మధ్య ఇప్పుడున్నంత మంచి సంబంధాలు ఎన్నడూ లేవని, ఈ సమయంలో తన పర్యటన శుభ సందర్భమన్నారు. నేను ఇంతటి సంతోషకరమైన ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రపంచంలో నేను ఎక్కడా దీనిని పొందలేకపోవచ్చేమో అంటూ జాన్సన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా మొదటి రోజు గుజరాత్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీ కి వెళ్లగా రాష్ట్రపతి భవన్ వద్ద ఆయనకు ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు. అలాగే ఆయనకు అక్కడ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది.
బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారత్ అజాదీకా మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక సందర్భం అంటూ మోదీ వ్యాఖ్యానించారు.













