ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వయ్ పై కాల్పులు
హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్లో అసదుద్దీన్ ఒవైసీ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు. యూపీలోని మీరట్, కిథౌర్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ఫ్లాజా దగ్గర అసద్ వాహనంపై ఆగంతకులు 3`4 కౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అసద్ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరొక వాహనంలో ఢిల్లీ బయలుదేరారు. అయితే దాడికి పాల్పడ్డ వారు ఎవరనేది తెలియలేదు. ఓవైసీ సైతం ఎవరిపై అనుమానాలు ఉన్నట్లు వెల్లడించలేదు.













