1970లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ : అమెరికా
భారతదేశంలో మార్చి నెల చివరివారం హోలీ పండుగ వచ్చేసరికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరగవచ్చనీ, 1970లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ పరిశోధకులు హెచ్చరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్‌లలో మార్చి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరే సూచనలు పెరుగుతున్నాయన్నారు. గతంలో ఈ ముప్పు మహారాష్ట్ర, బిహార్, ఛత్తీస్‌గఢ్‌లకు మాత్రమే ఉండేది. తాజా అధ్యయనం ప్రకారం భారత్‌లో కనీసం 37 నగరాలు 40 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతను చవిచూసే అవకాశం 1970లతో పోలిస్తే ఇప్పుడు ఒక శాతం పెరిగింది. 11 నగరాల్లో ఈ ప్రమాదం 10 శాతం ఎక్కువ. 4 డిగ్రీలకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రమాదం మధ్య భారతంలో 14 నగరాలకు ఉంది. దక్షిణాన మదురై నగరానికి ఈ ముప్పు ఎక్కువ.













