కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్…ఈడీ పదవీకాలం పొడిగింపునకు నో
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్దమని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆయన పదవీకాలం పొడిగింపు కుదరదని వెల్లడిరచింది. జులై 31 తర్వాత ఆయన ఆ పదవిలో ఉండరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆలోపు ఈడీకి కొత్త అధిపతిని నియమించుకోవాలని కేంద్రానికి సూచించింది. సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు ఉండకూడదంటూ 2021 నవంబర్‌లో ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడమేనని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడిరది. అయితే తక్షణమే ఈడీ చీఫ్‌ను మార్చాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు జులై 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగవచ్చని పేర్కొంది.













