ఆయనకు ధైర్యం ఉంటే ఒంటరిగా… ఇక్కడ పోటీ చేయాలి : స్మృతి ఇరానీ
లోక్సభ ఎన్నికల్లో అమేఠీలో బీజీపీ విజయం ఖాయమైందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రూ.206 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల తీర్పును ఊహించిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తుందని ఎద్దేవా చేశారు. అమేఠీ నియోజకవర్గం గాంధీ కుటుంబం కంచుకోట అని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. అది నిజమే అయితే, ఇప్పటిదాకా ఆ పార్టీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? ప్రజల తీర్పు ఏంటో వాళ్లకి బాగా తెలుసు. అందుకే అభ్యర్థిని ప్రకటించే ధైర్యం చేయలేకపోతుంది. ఇది ఆ పార్టీ ఓటమికి స్పష్టమైన సంకేతం. రాహుల్ గాంధీ రెండు చోట్లా పోటీ చేస్తున్నారంటే, ఎన్నికలకు ముందే అమేఠీలో ఓటమిని అంగీకరించినట్లే. ఆయనకు ధైర్యం ఉంటే మాయావతి, అఖిలేశ్ యాదవ్ మద్దతు లేకుండా ఒంటరిగా ఇక్కడ నుంచి పోటీ చేయాలి అని అన్నారు.













