దేశంలో ఇకపై ఆహారానికి ‘సాత్విక్ సర్టిఫికెట్లు’..!
దేశంలో ఇకపై ఆహారానికి ‘సాత్విక్ సర్టిఫికెట్లు’..! ఇప్పటి వరకు మార్కెట్లో ‘హలాల్ సర్టిఫైడ్’ అనే పేరు వింటూనే ఉన్నాం. మాంసాహారానికి ఈ సర్టిఫికెట్ ఇస్తుంటారు. ఇక నుంచి భారత దేశంలో శాకాహారానికి కూడా ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ‘సాత్విక్ కౌన్సిల్’ ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వెజిటేరియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ బోర్డు కావడం గమనార్హం. ఈ కౌన్సిల్ నుంచి ‘సాత్విక్ సర్టిఫికెట్లు’ జారీ అవుతాయి. కేవలం సాత్విక ఆహారాలకు మాత్రమే ఈ ధ్రువపత్రాలను అందిస్తారు. ఈ క్రమంలో మొట్టమొదటి ‘సాత్విక్ సర్టిఫైడ్’ ఆహారాన్ని రైల్వే మంత్రిత్వ శాఖలో అందించనున్నారు. దేశంలోని ప్రఖ్యాత ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’లో ఈ ఆహారాన్ని అందిస్తున్నారు.













