ఆప్ కు మరో ఎదురు దెబ్బ .. ఎంపీ సంజయ్ సింగ్ ను
ఆప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహారంలో సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో అఫ్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడాతో సంజయ్‌కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు బుధవారంర ఉదయం ఢిల్లీలోని ఎంపీ నివాసంలో కొన్ని గంటల పాటు సోదాలు జరిపారు. ఆ తర్వాత సంజయ్ సింగ్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అకాశం ఉన్నట్టు సమాచారం. ఆప్ నుంచి అరెస్టయిన కీలక నేతల్లో సంజయ్ సింగ్ మూడో నేత కావడం గమనార్హం.













