రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులకు అరుదైన గౌరవం
కూచిపూడి రంగంలో విశేష సేవలందిస్తున్న సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిని సంయుక్తంగా ప్రతిష్ఠాత్మక అకాడమీ రత్న పురస్కారానికి ఎంపిక చేసింది. వీరితో పాటు మరో అయిదుగురు ప్రముఖులు – రచయిత /జానపద అధ్యయనకారుడు వినాయక్ ఖెడేకర్, వైణికుడు ఆర్.విశ్వేశ్వరన్, కథక్ నృత్యకారిణి సునయన హజారీలాల్, రంగస్థల దర్శకుడు దులాల్ రాయ్, నాటక రచయిత డి.పి.సిన్హా 2022, 2023 సంవత్సరాలకు గాను అకాడమీ రత్న అవార్డు దక్కించుకున్నారు. ఢిల్లీలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో వీరందరినీ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అకాడమీ ఓ ప్రకటనలో వెల్లడించింది.













