శ్రీలంక మంత్రితో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జిఎల్ పీరిస్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ పరస్పరం చర్చించుకున్నారు. ద్వీపకల్ప దేశమైన శ్రీలంకకు భారత్ 500 అమెరికన్ డాలర్ల అదనపు సాయాన్ని ఇస్తున్నట్లు ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఇరు దేశాల విదేశీ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరగడం విశేషం. శ్రీలంక మంత్రి పీరిస్ మూడు రోజుల అధికారిక పర్యటనకు భారత్ వచ్చారు. తన పర్యటనలో భాగంగా భారత విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి జై శంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు తదితర అంశాలు మెరుగు కావాలని ఇరు దేశాల మంత్రులు ఆకాక్షించారు. అలాగే శ్రీలంక ఇంధన సామర్థ్యాలు మరింత బలపడేందుకు వీలుగా తీసుకోవాల్సిన ఆదనపు చర్యలపై ఉభయ దేశాల మంత్రుల మధ్య చర్చలు జరిగాయి.













