వారిని వివాహం చేసుకునే యువతలకు… రూ. 2 లక్షల నగదు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఓట్ల వేటలో నేతలు హామీలు గుప్పిస్తున్నారు. రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ రూ. 2 లక్షలు అందచేస్తుందని జేడీ(ఎస్)నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. కోలార్‌లోని పంచరత్న లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కుమారస్వామి మాట్లాడుతూ రైతుల పిల్లల పెండ్లిండ్లను ప్రోత్సహించేందుకు వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువతులకు ప్రభుత్వం రూ. 2 లక్షల నగదు అందించాలని కోరారు. రైతుల కుమారులను పెండ్లి చేసుకునేందుకు యువతులు సుముఖంగా లేరని తన దృష్టికి వచ్చిందని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ పథకం అమలు చేస్తేనే మన యువకుల ఆత్మ గౌరవాన్ని కాపాడవచ్చని అన్నారు.













